కోనసీమ: సఖినేటిపల్లి మండలం రాంబాగ్ దగ్గర శ్రీ చైతన్య స్కూల్ బస్సు అతి వేగంతో వచ్చి కొబ్బరి చెట్టును ఢీ కొట్టింది. బస్సులో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గొంది నుంచి అంతర్వేది రాంబాగ్ వస్తుండగా డ్రైవింగ్ క్లీనర్కి ఇవ్వటంతో ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.