ATP: సోమందేపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్‌కు చెందిన చిన్నారి పద్మినిని బుధవారం ఏఎస్సై మురళి తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న విషయం తెలుసుకుని తల్లి కవిత, నాన్న కేశవ్ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏఎస్సై మురళి మాట్లాడుతూ.. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.