KDP: చాపాడు మండలం అయ్యవారిపల్లె, తిమ్మాయ పల్లె, రామదాసుపురం గ్రామాలలో రెండు రోజులుగా కురిసిన తుఫాను కారణంగా వర్షాలకు దెబ్బతిన్న వరి పైరులను మండల వ్యవసాయ అధికారి దేవి పద్మలత పరిశీలించారు. అయ్యవారిపల్లె ప్రాంతంలో 80 ఎకరాల్లో వరి పైరులు వర్షపు ధాటికి పడిపోగా, మడూరులో 20 ఎకరాల్లో వరి పడిపోయి, మొలకలు వచ్చాయని, వీటిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు.