ప్రకాశం: కనిగిరి పట్టణంలోని స్థానిక చెప్పులు బజార్లో బుధవారం రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది అడ్డంగా ఉన్న దుకాణాలను తొలగిస్తున్నారు. పది రోజులు ముందుగానే దుకాణ యజమానులకు నోటీసులు జారీ చేయడంతో దుకాణదారులు షాపులను ఖాళీ చేయడం జరిగింది.