ELR: నూజివీడు మండల పరిధి మర్రికుంట గ్రామంలోని పంట పొలాలలో ట్రాన్స్ఫార్మర్ నుంచి రాగి వైర్‌ను గుర్తుతెలియని అగంతకులు చోరీ చేశారు. రాగి వైర్ చోరీతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని రైతులు వాపోయారు. ఈ సంఘటనకు సంబంధించి రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో నూజివీడు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.