SKLM: రిమ్స్ కాంట్రాక్టు కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి.మురళి, కార్యదర్శి ఆర్.ప్రకాశరావు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ వద్ద రిమ్స్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ సిబ్బంది ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ .26 వేలు అమలు చేయాలని కోరారు.