KDP: తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పునరావాస కేంద్రాలకు చేరుకున్న ప్రతి బాధితుడికి రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, ఒక కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నప్పటికీ, గరిష్ఠంగా రూ.3000 వరకు అందజేయాలని ప్రభుత్వం పేర్కొంది.