CTR: ఫెంగల్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంటను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. సోమవారం అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ శివకుమార్ తమ సిబ్బందితో కలిసి సోమల మండలంలోని నెల్లిమంద, తమ్మినాయుని పల్లిలో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని నమోదు చేసుకున్నారు.