TPT: తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం, వివిధ ప్రాంతాలను భక్తులు సులువుగా గుర్తించేలా సూచిక బోర్డులను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన సమీక్షలో తిరుమలలో భక్తులు వివిధ ప్రాంతాలకు సకాలంలో చేరుకునేలా ఉచిత బస్సులను పెంచాలని, ఘన వ్యర్థ పదార్థాలను వేగంగా తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు.