ప్రకాశం: ఉమ్మడి ప్రకాశంలోని పాలిటెక్నిక్ విద్యార్థుల క్రీడాపోటీలు గురు, శుక్రవారాల్లో జరుగుతాయని డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నోడల్ ప్రిన్సిపల్ శివప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన సుమారు 250 మంది పోటీల్లో పాల్గొంటారన్నారు. బాలికలకు ఈతముక్కల పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో, బాలురకు ఒంగోలు కళాశాల ఆవరణలో జరుగుతాయన్నారు.