KRNL: తుంగభద్ర నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని MRPS, మాలమహానాడు నాయకులు MRO రమాదేవికి వినతిపత్రం అందించారు. అధికారులు అక్రమదారులతో కుమ్మక్కై చర్యలు తీసుకోవడంలో విఫలమైపోయారని ఆరోపించారు. పాత్రికేయులను బెదిరించిన ఘటనపై కూడా పోలీసులు స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇసుక దోపిడీ కొనసాగితే భూగర్భ జలాలు అడుగంటి పోతాయన్నారు.