SKLM: అన్నమయ్య జిల్లా గాలివీడులో ఎంపీడీవో జవహర్బాబుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంపీడీవో కార్యాలయాల సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కోటబొమ్మాళి, జలుమూరు మండలాల్లో ఎంపీడీవోలు ఫణీంద్రకుమార్, కె.అప్పలనాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దోషులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.