విజయనగరం: వంగర మండలానికి 6 వెల్నెస్ సెంటర్లు మంజూరైనట్లు వైద్యాధికారిణి CH సుస్మిత దయాన సోమవారం తెలిపారు. వంగర మండలంలోని కింజంగి, కొప్పర, మడ్డువలస, మరువాడ, వీవీఆర్ పేట, శ్రీహరిపురం గ్రామాలకు వెల్నెస్ సెంటర్లు మంజూరయ్యయన్నారు. రూ.2.16 కోట్లతో వాటి సెంటర్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్ ఇంజినీర్ అధికారి ప్రభాకర్ రావు చెప్పారు.