NTR: జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందాలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై జి.రాజు హెచ్చరించారు. జగ్గయ్యపేటలో ఎస్సై రాజు శుక్రవారం మాట్లాడుతూ.. రానున్న సంక్రాంతి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలను ఆనందోత్సాహాల నడుమ కుటుంబ సభ్యులతో నిర్వహించాలన్నారు. ఎంతటి వారైనా పేకాట, కోడి పందాలు వేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
Tags :