W.G: పద్మభూషణ్ సూపర్ స్టార్ డా.ఘట్టమనేని కృష్ణ 83వ జయంతి వేడుకలు భీమవరంలో ఘనంగా జరిగాయి. ప్రభుత్వాస్పత్రి రోడ్డులోని కృష్ణ విగ్రహం వద్ద ఆదివారం కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అభిమానులు, అసోసియేషన్ ప్రతినిధులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.