ASR: పాడేరులోని సర్వే నెంబర్ 54లో ముఖేష్ అనే గిరిజనేతరుడు రోడ్డు పోరంబోకు భూమిని కబ్జా చేశాడని సీపీఐ జిల్లా నేత అమర్ ఆరోపించారు. దీనిపై రెవెన్యూ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఆయన మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు భూమిని కబ్జా చేయడం చట్ట వ్యతిరేకం అన్నారు.