సత్యసాయి: మడకశిర నగర పంచాయతీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కూరగాయల మార్కెట్, వారపు సంత, బస్టాండ్ పార్కింగ్ సుంకం వసూళ్లకు గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. ఎవరూ పాల్గొనకపోవడంతో మున్సిపల్ కమిషనర్ రంగస్వామి తిరిగి ఈ వేలాన్ని ఫిబ్రవరి 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.