NDL: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. నంద్యాలలోని పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా పట్టణ, ట్రాఫిక్ సీఐలు, పోలీసులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు.