NLR: ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో నేటి నుంచి సదరన్ ఇండియన్ సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి కరుణాకర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8, 9,10 తరగతి విద్యార్థులు మూడు గ్రూపులుగా విడిపోయి ప్రాజెక్టులు తయారు చేసి ఒక గ్రూపును మండల స్థాయికి ఎంపిక చేసి 30న జరిగే జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేయాలన్నారు.