SKLM: పలాస రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళను ఆర్పీఎఫ్ ఎస్సై మాల్యాద్రి అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర 11 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని మహిళను రైల్వే పోలీసుల చేతికి అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు రైల్వే ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.