అల్లూరి: అనంతగిరి మండలం బల్లగరువులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నేపధ్యంలో రాచకిలం, గుమ్మంతి, దాయిర్తి గ్రామాల గిరిజనులు అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో గిరిజనులు అక్కడే బైటాయించి తమ నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ జోక్యం చేసుకోవడంతో సభకు వీరిని అనుమతించారు.