W.G: ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నరసాపురం ఆర్డీవో దాసిరాజు అధికారులను ఆదేశించారు. నరసాపురం సబ్ కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 34 ఫిర్యాదులు వచ్చాయని ఆర్డీవో తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.