SKLM: గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే మట్టి రహదారులు గడిచిన 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. లావేరు మండలంలోని జాతీయ రహదారి తాళ్లవలస నుంచి అగ్రహారం, నాగంపాలెం, పిట్టపాలెం, గుమ్మడం వెళ్లే 7 కిలోమీటర్ల రహదారి ఎక్కడికక్కడ బురదమయంగా మారడంతో.. ఆయా గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.