బాపట్ల: మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో జరిగిన రత్నం బాబు(22) హత్య కేసులో 8మంది నేరస్థులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు అడిషనల్ డిస్టిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రాజవెంకటాద్రి మంగళవారం తీర్పు ఇచ్చారు. కాగా, రత్నంబాబు కరిష్మా అనే యువతిని ప్రేమించాడు. అది నచ్చని యువతి కుటుంబ సభ్యులు రత్నంబాబును కత్తులతో పొడిచి హత్య చేశారు.