కోనసీమ: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తుంది. ప్రధాని మోడీ కర్నూలు పర్యటన, అలాగే వాడపల్లి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు బలగాలు ఆ కార్యక్రమాలకు వెళ్ళాయి. ఈ మేరకు దీపావళి అనంతరం పవన్ కళ్యాణ్ రాజోలు వస్తారని ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ప్రకటన విడుదల చేశారు.