GNTR: రాజధాని ప్రాంత మహిళల ఆర్థిక సాధికారత కోసం APCRDA ఆధ్వర్యంలో VIT–AP యూనివర్సిటీలో ఉచిత హౌస్కీపింగ్ నైపుణ్య శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. 15 రోజులపాటు జరిగే ఈ శిక్షణలో 76 మంది మహిళలు పాల్గొంటున్నారు. శిక్షణకు ఉచిత రవాణా సదుపాయం కల్పించామని అధికారులు తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.