NLR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్‌లు పాల్గొని అర్జీ దారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. మొత్తం 56 వినతులు వచ్చినట్లు తెలియజేశారు. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.