ATP: జిల్లా అడిషనల్ డీఎంహెచ్ఓగా పని చేస్తున్న డా.సుజాతకు డీఎంహెచ్ఓగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతేకాకుండా నెల్లూరు డీఎంహెచ్ఓగా ప్రభుత్వం నియమించింది. దీంతో త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. తోటి డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.