AKP: నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరాహార దీక్షలు, ధర్నాలు నిర్వహించడానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. రాజయ్య పేటలో ప్రజాశాంతికి భంగం కలిగే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజుకు ఆదివారం రాత్రి నోటీసులు ఇచ్చారు.