కోనసీమ: ట్రూ అప్ ఛార్జీల భారం వినియోగదారులపై పడకుండా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు. ఆదివారం ముమ్మిడివరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుదారి నిర్ణయం వల్ల ప్రజలపై అదనపు భారం మోపే పరిస్థితి ఏర్పడిందన్నారు