ప్రకాశం జిల్లాలో బుధవారం విషాద ఘటన వెలుగు చూసింది. సంతనూతలపాడు సమీప చెరువులోకి చిన్నారితో కలిసి తల్లి దూకేశారు. సమాచారం అందుకున్న సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు గజ ఈతగాళ్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతులు సంతనూతలపాడుకు చెందిన బాపట్ల సుజాత(35), అశ్వజ్ఞ(6 నెలలు)గా గుర్తించారు.