W.G: విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించేది లేదని ప.గో.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం పాలకోడేరు తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆమె మాట్లాడారు. ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపరచడంతో పాటుగా.. ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చేలా అధికారులు పనిచేయాలని సూచించారు.