KRNL: ఎమ్మిగనూరులో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ CITU నాయకులు రాముడు ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా నిర్వహించారు. ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా సామాన్య ప్రజలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.