అల్లూరి: అరకులోయ మండలంలో శనివారం రెండు రెవెన్యూ సదస్సులు జరిగాయి. మండలంలోని టిడిగూడలో, మాడగడలో జరిగిన రెవెన్యూ సదస్సులకు ఆర్ఐ బలరాం, డిటీ గోవిందు, మండల సర్వేయర్ శ్రీనివాస్ హజరయ్యారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం జరుపుతున్నట్లు ఎంఆర్ఓ ఎంవివి ప్రసాద్ తెలిపారు. భూముల మ్యూటేషన్, ఎఫ్ లైన్లకు సంబందించి 25 ఆర్జీలు వచ్చాయన్నారు.