PPM: వీరఘట్టం మండలంలోని రేగులపాడు- య. వెంకమ్మరేట మధ్యలో సీఎస్పీ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తేజ అనే యువతికి గాయాలయ్యాయి. తెట్టంగి గ్రామానికి చెందిన ఈ యువతి తన బంధువులతో కలిసి స్కూటీపై పార్వతీపురం వెళుతుండగా మార్గం మధ్యలో స్కూటీ అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమెను వైద్య చికిత్సల కోసం వీరఘట్టంకు తరలించారు.