PLD: నరసరావుపేట జిల్లా కేంద్రమయ్యాక వాహనాల రద్దీ పెరిగింది. సరైన పార్కింగ్ లేక ప్రజలు అల్లాడుతున్నారు. మల్లమ్మ సెంటర్, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో రోడ్లపైనే వాహనాలు నిలపడంతో నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తోంది. పనుల నిమిత్తం వచ్చే వారు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.