CTR: పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 26న విద్యార్థులు, పోలీసులకు వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి ఎస్పీ తుషార్ గురువారం బహుమతులు పంపిణీ చేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ విభాగాలలో బహుమతులు రూ. 5 వేలు, 3 వేలు, 2 వేల నగదు ప్రోత్సాహక బహుమతులను ఆయన అందించారు.