ATP: గుత్తి పట్టణంలోని నురాణి మసీద్‌లో రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ఆదివారం రాత్రి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఏంకే చౌదరి హాజరయ్యారు. ముందుగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షలు ఉన్నవారికి ఇఫ్తార్ విందును ప్రారంభించారు.