ATP: నార్పల మండలంలోని పులసలనూతల గ్రామంలో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. కనీసం రోజుకు ఒకసారైనా కుళాయి నీళ్లు రాకపోవడంతో బోరు బావుల దగ్గరకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని పులసలనూతల గ్రామస్థులు కోరుతున్నారు.