TPT: టీపీకోట – సత్యవేడు మార్గంలో ఇవాళ రావాల్సిన ఏడు గంటల చెన్నై బస్సు రాకపోవడంతో ఇంటర్ పరీక్షలకు హాజరు కావలసిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు వారి వాహనాల్లో పరీక్ష కేంద్రానికి తీసుకెళ్తుండగా కొంతమంది విద్యార్థులు బస్సు కోసం రోడ్లపై నిరీక్షిస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.