W.G: గత వైసీపీ ప్రభుత్వంలో జీవో నెంబర్ 3ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. జీవో నెంబర్ 3 అమలుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేసిందన్నారు. త్వరలో ప్రకటించబోయే డీఎస్సీలో గిరిజనుల కోసం కొంత వెసులుబాటు కల్పించాలని స్పీకర్ను కోరారు.