కోనసీమ: అమలాపురం శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో ఈనెల 21న అమలాపురంలో జరగనున్న 160వ జాతీయ శతాధిక కవి సమ్మేళనకు సంబంధించిన పోస్టర్ను MLA అయితా బత్తుల ఆనందరావు గురువారం ఆవిష్కరించారు. శ్రీ కళావేదిక నిర్వహించే కార్యక్రమాలకు తన వంతు తోడ్పాటు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వేదిక సీఈవో కత్తిమండ ప్రతాప్, కవి నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.