ప్రకాశం: పంగులూరు మండలంలో అన్ని గ్రామ పంచాయితీలలో సోమవారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో స్వరూప రాణి ఆదివారం తెలిపారు. స్వేచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలను పరిశుభ్ర వాతావరణంలో ఉండటమే ఈ గ్రామసభల నిర్వహణ ముఖ్య ఉద్దేశం అన్నారు. జీరాంజీ ఉపాధి హామీ పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజుల పెంపుపై గ్రామ సభల్లో అవగాహన కల్పిస్తామన్నారు.