E.G: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపుమేరకు రాజానగరంలో ‘పల్లె పల్లెకు బీజేపీ జెండా’ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. రాజానగరం జాతీయ రహదారి వద్ద భారీ భారత జనతా పార్టీ జెండాను ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవిష్కరించారు. ఇంత భారీ స్తూపాన్ని మొదటిగా ఇక్కడే ఆవిష్కరించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జండా స్థూపాలు నిర్మిస్తామన్నారు.