ATP: వైసీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి అంత్యక్రియలను ఈ నెల 14న నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని అన్నారు. అమెరికాలో ఉన్న భాస్కర్‌రెడ్డి కూతురు శనివారం రాత్రికి స్వగ్రామానికి వస్తారని చెప్పారు.