KKD: వరుస వర్షాల కారణంగా యు.కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామం ముంపునకు గురైంది. ఈ సమాచారం తెలుసుకున్న Dy.Cm పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు ఛైర్మన్ సునీల్ కుమార్ శనివారం మత్స్య, ఇరిగేషన్, రెవెన్యూ తదితర అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు. యంత్రాలతో కాలువల అడ్డంకులను తొలగిస్తూ గ్రామాల్లో పర్యటిస్తున్నారు.