ATP: జిల్లా రైతులు ఆధునిక సాంకేతికతతో ఢిల్లీ దోస సాగు చేస్తున్నారు. జిల్లాలో 1,500 ఎకరాల్లో సాగైన ఈ పంటకు రంజాన్ సందర్భంగా ఢిల్లీ, ముంబై నగరాల నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. వీటిని విక్రయించే ఒక్కో పెట్టెలో దోస కాయలు 5 చొప్పున 6.5 కిలోలు ఉంటాయి. ప్రస్తుతం పెట్టె ధర రూ.260-400 పలుకుతోంది. రైతులు అధిక లాభాలు గడిస్తున్నారు.