గుంటూరులో వీధి కుక్కల బెడదను నివారించేందుకు వాటికి ఆశ్రమాలు ఏర్పాటు చేయాలని సోమవారం బహుజన మహాసభ, ప్రజా సంఘాల ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. బహుజన మహాసభ కేంద్ర కార్యదర్శి భగత్ సింగ్ మాట్లాడుతూ.. వీధి కుక్కల వల్ల పిల్లలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.