NLR: సోమశిల ప్రాజెక్టు ఛైర్మన్గా చేజర్ల మండలం నాగులవెల్లటూరుకు చెందిన సోమశిల దక్షిణ కాలువ డిస్ట్రిబ్యూటర్ అధ్యక్షుడు వేలూరు కేశవ చౌదరి శనివారం నియమితులయ్యారు. ఈ మేరకు తనను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు పార్టీ అధిష్టానానికి, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, టీడీపీ సీనియర్ నాయకులు తాళ్లూరి గిరినాయుడుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.