NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణం గాంధీ నగర్ హెచ్పీ గ్యాస్ ఆఫీస్ వద్ద కాలువపై ఉన్న రోడ్డుకు గుంట పడింది. దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తా శీనయ్య సొంత ఖర్చుతో గుంటను పూడ్చారు. గుంటను పూడ్చడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.